KVBపురం రైతుల అకౌంట్‌లోకి రూ.5.07 కోట్ల జమ

TPT: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. ఈ మేరకు KVBపురం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నగదు కింద రూ.5.07 కోట్ల మెగా చెక్కు పంపిణీ చేశారు. అనంతరం రైతులకు సబ్సిడీకి నవధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.