కొనుగోలు కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం

కొనుగోలు కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం

KMR: నాగిరెడ్డి పేట మండలం పోచారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న 3 వేల ఖాళీ సంచులు కాలిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టి ఉంటారని ఐకేపీ సీసీ నారాయణ తెలిపారు. ధాన్యం నింపేందుకు కేంద్రం వద్ద ఖాళీ సంచులు ఉంచామని ఆయన చెప్పారు. సంచులు కాలిపోయిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.