జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
HNK: ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన జాతర ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.