రాయదుర్గంలో అభివృద్ధి పనుల పరిశీలన
ATP: ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశాలతో రాయదుర్గంలో సాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డితో కలిసి నాయకులు పరిశీలించారు. మాజీ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ టెంకశాల హనుమంతు, మైనార్టీ జిల్లా అధికార ప్రతినిధి జిలాన్ భాషా పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు సూచనలు ఇచ్చారు.