బంజారాహిల్స్‌లో రూ. 2 కోట్ల స్కామ్

బంజారాహిల్స్‌లో రూ. 2 కోట్ల స్కామ్

HYD: బంజారాహిల్స్‌లో మరో భారీ నిర్మాణ సంస్థ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఏజీఎం స్థాయి అధికారి ఉద్యోగుల జీతాల పేరిట ఏకంగా రూ. 2 కోట్లు స్వాహా చేసిన ఘటన సంచలనం రేపింది. అంతర్గత లావాదేవీల్లో గందరగోళాన్ని గుర్తించిన సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ మోసంపై దర్యాప్తును ప్రారంభించారు.