పల్టీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

పల్టీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

సత్యసాయి: నల్లచెరువు మండల పరిధిలోని ఎర్రగుంట్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయపడ్డారు. అయితే, అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.