మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్

GNTR: పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆమె సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు.