ఢిల్లీ అసెంబ్లీ వద్ద హైటెన్షన్
ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అసెంబ్లీ వీఐపీ గేటును ఢీ కొట్టి ఓ కారు లోపలికి దూసుకెళ్లింది. ఆ కారు యూపీలో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు. స్పీకర్ ఛాంబర్ వద్ద పూల బోకే పెట్టి ఆగంతకులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.