బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం

బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం

KRNL: వెల్దుర్తి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి శుక్రవారం కర్నూలు బ్రాంచ్‌కి బదిలీ అయ్యారు. దీంతో మిగతా బ్యాంక్ అధికారులు, సిబ్బంది ఆయనకు శాలువా, పూలమాలతో సత్కరించి, సన్మానించారు. బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు, బీసీ పాయింట్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సిబ్బంది భాస్కర్ రెడ్డి, రుశేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.