అంతర్ జిల్లా కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

అంతర్ జిల్లా కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: 51వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవసరమైన సదుపాయాలు అందిస్తోందని తెలిపారు. పోటీల్లో మెరుగైన ప్రదర్శన చూపించాలని ఆటగాళ్లను ప్రోత్సహించారు.