హైదరాబాద్‌లో 2 లక్షల రేషన్ కార్డుల రద్దు!
TG: తెలంగాణలో అనర్హుల రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. పాన్, జీఎస్టీ ఆధారంగా హైదరాబాద్‌లోనే 2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులకు కార్డులున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 80 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని, పూర్తి నివేదిక అందగానే వీరి కార్డులను రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.