'సండే విత్ సైకిల్'తో పోలీసుల ర్యాలీ

'సండే విత్ సైకిల్'తో పోలీసుల ర్యాలీ

TPT: తిరుపతిలో ఆదివారం 'సండే విత్ సైకిల్' కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, 'ఫిట్ ఇండియా.. ఫైట్ ఓబీసీటీ ' ముఖ్య ఉద్దేశ్యంగా పట్టణంలోని పూర్ణకుంభం సర్కిల్ నుంచి పద్మావతి నగర్ సర్కిల్ మీదుగా సుభాశ్ చంద్రబోస్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.