గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

MHBD: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సగ్గం ఉపేందర్ (20) బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లోనే కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.