'యూనివర్సిటీ అంతటికి ఒకే నెట్‌వర్కింగ్ ఉండాలి'

SKLM: యూనివర్సిటీ అంతటికి ఒకే నెట్‌వర్క్ ఉండాలని AP యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ పి.వల్లీకుమారి పేర్కొన్నారు. ఎచ్చెర్లలో బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ నెట్‌వర్కింగ్‌లో సాంకేతిక ఇబ్బందులను గమనించి వాటి పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. కంప్యూటర్ నెట్‌వర్కింగ్, వైఫై కనెక్టివిటీ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు