ఏలూరులో ఆటో డ్రైవర్ హత్య
ఏలూరు రూరల్ పరిధిలోని గణేశ్ నగర్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్ నమ్మి హరికృష్ణ (32)ను హత్య చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అదే ప్రాంతానికి చెందిన టీ మాస్టర్ దీపక్ హరికృష్ణపై కత్తితో దాడి చేశాడు. హరికృష్ణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. హరికృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.