అడవిలో మహిళపై దాడి

అడవిలో మహిళపై దాడి

CTR: నగరంలో గంగాసాగరం వద్ద మంగళవారం జీడీ నెల్లూరుకు చెందిన వసంతమ్మపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వివరాల్లోకెళ్తే ఆమెను అటవీ ప్రాంతంలో సెల్ టవర్ కూలీ పని ఉందని తీసుకెళ్లి బంగారు నగలు దోచుకున్నారు. ఈ దాడిలో ఆమె చెవులు తెగిపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆమె ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.