గల్లంతైన ఆరు గ్యారంటీలు: ఎంపీ

గల్లంతైన ఆరు గ్యారంటీలు: ఎంపీ

MBNR: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు.