VIDEO: 'మదనపల్లి జిల్లాకు అబ్దుల్ కలాం పేరును ప్రకటించాలి'
CTR: నూతనంగా ఏర్పాటు చేయనున్న మదనపల్లి జిల్లాను కూటమి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జిల్లాగా ప్రకటించాలని కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆయుబ్ ఖాన్ కోరారు. శుక్రవారం పుంగనూరులో ఆయన మాట్లాడారు. ఒక ప్రముఖ శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి 'మిస్సైల్ మ్యాన్' గా ప్రసిద్ధి చెందారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును జిల్లాకు పెట్టాలని వారు కోరారు.