గంజాయి చాక్లెట్ల కలకలం
TG: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఓ పాన్ షాపులో తనిఖీలు చేయగా 238 గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో వీటిని విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన అజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.