UPDATE: పరిశ్రమలో అగ్నిప్రమాదానికి కారణాలివే
SRD: ఎరిథ్రో రసాయన పరిశ్రమలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్లలో సాల్వెంట్లు లోడ్ చేస్తుండగా స్పార్క్ రావడంతో మంటలు చెలరేగాయి. కార్మికులు భయంతో పరుగులు తీయగా, మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. DFO నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.