పరేడ్ రిహార్సల్‌లో తిరుపతి ఎస్పీ పర్యవేక్షణ

TPT: తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ పర్యవేక్షణలో శ్రీ తారకరామా స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్ నిర్వహించారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగురవేశారు. క్రమశిక్షణతో కవాత్ నిర్వహించి దేశభక్తి భావం కలిగించాలని సూచించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్, సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు.