ఈనెల 13న BSNL లోక్ అదాలత్
ATP: అనంతపురంలో ఈ నెల 13న జరగనున్న నేషనల్ లోక్ అదాలత్‌లో క్లోజ చేసిన BSNL ల్యాండ్‌ఫోన్, ఎన్టీటీహెచ్ వినియోగదారులు బకాయిలను రాయితీతో చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపల్ జీఎం ముజీబ్ పాషా తెలిపారు. కోర్టుకు హాజరు అవసరం లేకుండానే 13లోపు బకాయిలు చెల్లించవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం 94415 53313 మొబైల్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.