గిద్దలూరులో ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు
ప్రకాశం: గిద్దలూరులో పాఠశాలలు, ఇళ్లు, రహదారుల దగ్గర ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజల్లో భయం రేకెత్తిస్తున్నాయి. నల్లబండ బజార్, ఆంటి హోటల్ ప్రాంతం, ABMపాలెం రోడ్, రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెప్పారు. అధికారులు వెంటనే ఫెన్సింగ్ కంచె ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.