'గుంతల దారితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు'

'గుంతల దారితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు'

VKB: తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారి నిర్మాణం పదహారేళ్లుగా పూర్తి కావడం లేదు. నిధులు మంజూరైనా బిల్లులు రాకపోవడంతో గతంలో గుత్తేదారు పనులు మధ్యలో వదిలేశారు. తాజాగా అదనపు నిధులు మంజూరైనా, టెండర్ పొందిన సంస్థ పనులు ప్రారంభించడం లేదు. దీనితో లక్షలాది మంది ప్రయాణికులు, వాహనదారులు గుంతల దారిలో తీవ్రఇబ్బందులు పడుతున్నారు.