ఆరేళ్ల బాలుడు మిస్సింగ్ కేసు నమోదు

MHBD: గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామం లక్ష్మణ్ తండాకు చెందిన ఆరేళ్ల బాలుడు వాంకుడోత్ జాన్ పాల్ బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆదివారంపేట గ్రామానికి వెళ్లి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో తప్పిపోయాడని గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసిన 9676899537, 8712656963, నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.