నేడు కేరళంలో సీఎం రేవంత్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. UDF అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 8:30 గంటలకు కోవలంలో భారీ రోడ్ షోతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10:30 గంటలకు మావెలికర నియోజకవర్గంలో పర్యటించి, మధ్యాహ్నం పతానపురంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.