చమురు విక్రయానికి సిద్ధంగా ఉన్నాం: ఇరాక్

చమురు విక్రయానికి సిద్ధంగా ఉన్నాం: ఇరాక్

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాక్ కీలక సందేశం ఇచ్చింది. తమ దేశం చమురు విక్రయించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. హర్మూజ్ జలసంధి నుంచి ఆ దేశ చమురు రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు స్పష్టంచేసింది. 24 గంటల్లోగా ముడిచమురు నౌకల నామినేషన్లు, ఒప్పందాలు సహా తరలింపు షెడ్యూళ్లను పంపాలని వినియోగదారులను కోరింది. ఈ దేశం చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి.