సనత్‌నగర్ ‘టిమ్స్' ప్రారంభోత్సవం వాయిదా
HYD: సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. తొలుత 19న ఉగాది రోజున ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, పలు విభాగాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.