VIDEO: 'ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికడతాం'
NRML: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికడతామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేటి ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణా ఎవరైనా చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సారంగాపూర్, ముధోల్ మండలాలలో చెక్పోస్ట్ లు 24 గంటలు పనిచేస్తాయన్నారు.