పిల్లలమర్రి బాలోత్సవం వేడుకలు వాయిదా
MBNR: జిల్లా కేంద్రంలో ఈ నెల 19, 20న జరగనున్న 'పిల్లలమర్రి బాలోత్సవం' 4వ పిల్లల జాతర స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడింది. దీన్ని జనవరి 5, 6న నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు బెక్కెం జనార్ధన్ తెలిపారు. ఈ ఉత్సవంలో 37 రకాల ఈవెంట్స్ ఉంటాయని, పాఠశాలలు JAN 2 లోపు ఆన్‌లైన్ గూగుల్ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆర్గనైజింగ్ కార్యదర్శి పేర్కొన్నారు.