స్థానిక ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ
PDPL: ఓదెల మండలం గుంపుల గ్రామంలో స్థానిక ఎలక్షన్ల సందర్భంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్సై రమేష్ వాహనాల తనిఖీ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐ రత్నాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.