AP నుంచి నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు

AP నుంచి నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు

AP: గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీ నుంచి మూడు శాటిలైట్లు నింగిలోకి దూసుకెళ్లాయి. వర్సిటీకి చెందిన 34 మంది విద్యార్థులు వీటిని రూపొందించారు. లాంచ్ ప్యాడ్‌గా గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉన్న ఈ శాటిలైట్లు.. మూడు నెలలు ట్రోపోస్పియర్ పొరలో ఉంటాయి. గాలి నాణ్యత, టెలిమెట్రీ పరీక్షల కోసం ఇవి పనిచేస్తాయి.