VIDEO: మీడియా ఛానల్స్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్
కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని పలు మీడియా ఛానల్స్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైయస్ భారతి పేరు గాని, ఫొటో గాని ప్రదర్శిస్తే ఒక్కొక్కరి పని చెబుతానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. "రేపటి నుంచి చూసుకుందాం నువ్వు నేను" అంటూ మీడియా ఛానల్స్‌కు సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, వీడియోను YCP 'X'లో షేర్ చేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.