గంపలగూడెంలో MRO కార్యాలయం వద్ద నిరసన

గంపలగూడెంలో MRO కార్యాలయం వద్ద నిరసన

కృష్ణా: గంపలగూడెం ఎమ్మార్వో కార్యాలయం ముందు మంగళవారం ఆటో వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్లను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.