పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASR: డుంబ్రిగూడ మండలం కించుమండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకొని, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. రోజు వారి మెను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు.