చెన్నవరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సగిలేరు
KDP: కాశి నాయన మండలంలోని చెన్నవరం గ్రామం వద్ద సగిలేరు బ్రిడ్జిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ దారిలో వాహనదారులు వెళ్ళవద్దని కాశి నాయన మండల ఎస్సై యోగేంద్ర ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చెన్నవరం గ్రామం వద్ద సగిలేరు బ్రిడ్జిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులు సురక్షిత మార్గాలను చూసుకొని వెళ్లాలన్నారు.