'పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకుందాం'
మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకుందామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రూ. 50 లక్షల వ్యయంతో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.