ఈద్గాపై అనవసర రాజకీయాలు వద్దు: మంత్రి
NDL: బనగానపల్లెలోని ఈద్గాను శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఈద్గా కూల్చివేతలపై కొందరు అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని వసతులతో నూతన ఈద్గాను నిర్మించి ముస్లింలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.