ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే తన ముఖ్య ఉద్దేశం: ఎమ్మెల్యే

అడ్డగూడూరు: గురువారం భువనగిరి నుండి లక్ష్మీదేవికాల్వ గ్రామ వరకు వేయించిన బస్సును రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే తన ముఖ్య ఉద్దేశమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సౌకర్యార్థం బస్సు వేయించినట్లు పేర్కొన్నారు. ఈ బస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు