ఐకేపీ సెంటర్ కోసం రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు

ఐకేపీ సెంటర్ కోసం రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు

KNR: చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్‌కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలంటూ గ్రామస్థులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. బొమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలోనే ఐకేపీ కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రత్యక్షంగా వచ్చి హామీ ఇస్తేనే ధర్నాను విరమిస్తామన్నారు.