VIDEO: కాళేశ్వరం వద్ద భారీగా పెరుగుతున్న ఉభయ నదులు

JBL: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు భారీగా పెరుగుతున్నాయి. ఎగువన వర్షాలు పడుతుండటంతో ఉభయ నదులు పొంగిపొర్లుతూ 6.79 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. బుధవారం పుష్కర ఘాట్ వద్ద 10.67 మీటర్ల ఎత్తులో లక్ష్మీ బ్యారేజీ వైపు ప్రవాహం ఉంది. బ్యారేజీకి వచ్చిన నీటిని 85 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు వదులుతున్నారు.