ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి మృతి

KDP: బద్వేల్లో గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి కృష్ణం పల్లె, చల్లగిరిగెలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు డిపోలో నుంచి బయటికి వచ్చి టర్నింగ్ తిరుగుతుండగా ఆ వ్యక్తిపై ఫ్రంట్ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.