VIDEO: అకాల వర్షంతో రైతన్నకు తీరని నష్టం
SRCL: అకాల వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కలవరపెడుతున్నాయి. పలు మండలాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమయ్యేసరికి, అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు నీటిపాలయ్యాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.