మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
SKLM: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం చల్లవానిపేటలో ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యలో అనేక సంస్కరణ చేపట్టిన మహనీయుడని కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ మామిడి సత్యనారాయణ అన్నారు. ఆయనతో పలువురు నేతలు పాల్గొన్నారు.