బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్న సచివాలయ సిబ్బంది

NLR: సమయపాలన పాటించని సచివాల సిబ్బంది. మండల కేంద్రమైన ఉదయగిరిలోని బండగానపల్లి సచివాలయంలో సిబ్బంది లేకపోవడంతో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు లాంటి పనులు చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు సైతం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో తమ ఇష్టారాజ్యంగా సచివాలయ సిబ్బంది ప్రవర్తిస్తున్నారు.