ట్రాక్టర్ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్ బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

గుంటూరు: మాచవరంలో బుధవారం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ పిన్నెల్లి మలుపు వద్ద తిరగబడి సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మాచవరం నుండి 50 మందితో పిన్నెల్లి లో ఒక రైతు పొలంలో మిర్చి పంట కోసేందుకు వ్యవసాయ కూలీలతో ట్రాక్టర్ బయలుదేరింది కొద్దిసేపటికి ఈ ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులను గుంటూరు వైద్యశాలకు తరలించారు.