భీంపురంలో అగ్నిప్రమాదం.. పంట నష్టం
GDWL: భీంపురం శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో రైతులు ఆంజనేయులు, హనుమంతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. నిల్వలో ఉన్న కంకులు కూడా మంటల్లో కాలిపోయాయి. కూలీలు, రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ ఘటనలో సుమారు రూ.1.80 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.