ఆ సమస్య మీదే ఎక్కువ అర్జీలు: తహసీల్దార్

ప్రకాశం: మార్కాపురం మండలం నాయుడుపల్లిలో తహసీల్దార్ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రాలు అందజేశారు. పొలాల దారి సమస్యల పరిష్కారం కోసం అధిక అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ కందుల శ్రీనివాస రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.