'దామెర్ల వాగు కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలి'
ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని గణేష్ నగర్ – కొత్త కండ్రిక నాగులవరం మధ్యలో ఉన్న దామెర్ల వాగు కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. ఈ నేపథ్యంలో జిల్లా సీఐటీయు నాయకులు రాయల మాలకొండయ్య ప్రభుత్వం వెంటనే స్పందించి కల్వర్టును పరిశీలించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.