హాస్టల్‌లో రాత్రి బస చేసిన ఏటీడబ్ల్యూవో

హాస్టల్‌లో రాత్రి బస చేసిన ఏటీడబ్ల్యూవో

అల్లూరి: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం రాత్రి సందర్శించామని ఏటీడబ్ల్యూవో క్రాంతి తెలిపారు. విద్యార్థులతో ముచ్చటించి, అనంతరం భోజనం చేసినట్లు పేర్కొన్నారు. వంటశాల, భోజనశాల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు. స్టడీ హవర్స్‌లో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అవగాహన కల్పించామన్నారు.